“బాబు” శుద్ధ అబద్ధం చెబుతున్నాడు …!

బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం శుద్ధ అబద్ధమని వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాం లో జారీ చేసిన 222 జీవో రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ లో ప్రకటించిన ముఖ్యమంత్రి, మరి తమ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97 ను ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. అంటే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పకనే చెప్పినట్లే కదా అని నిలదీశారు .

అబయన్స్ లో జీవో అంటూ తవ్వకాల కోసం చర్యలు

ఒక వైపు ప్రభుత్వం 97 జీవో అబయన్స్ లో పెడుతున్నామని చెబుతూనే, మరొక వైపు బాక్సైట్ తవ్వకాల కోసం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తోందని జగన్ విమర్శించారు.బాక్సైట్ తవ్వకాలను చేపడుతామని కానీ, పెన్నా ప్రతాప్ రెడ్డి కంపెనీకి నిక్షేపాలు సరఫరా చేయమని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతాప్ రెడ్డి తో కుమ్మక్కై చంద్రబాబు ఈ నాటకానికి తెర లేపారని ఆరోపించారు. వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం లో భాగంగానే , గత ప్రభుత్వం జారీ చేసిన 222 జీవో ను రద్దు చేసినట్లు ప్రకటించారన్నారు.

ప్రతాప్ రెడ్డి కోర్టు వెళుతాడు

గతం లో జారీ చేసిన జీవో 222 రద్దు చేయడాన్ని పెన్నా ప్రతాప్ రెడ్డి కోర్టు సవాల్ చేసే అవకాశాలున్నాయని జగన్ తెలిపారు. ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందం లో భాగంగా అల్యూమినీయం కంపెనీ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతాప్ రెడ్డి 5,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని చంద్రబాబే తన శ్వేత పత్రం లో పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతాప్ రెడ్డి కోర్టు లో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బాబు, ప్రతాప్ రెడ్డి కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని జగన్ ఆరోపించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com