ఓటరు వీక్నెస్ ను చూసి తెలుగు గడ్డ ఏడుస్తుంది..!!

Cash for votes in Nandhyal elections nandyal ఓటరు వీక్నెస్ ను చూసి తెలుగు గడ్డ ఏడుస్తుంది..!! nandhyala elections

నోటుకి అమ్ముడు పోతున్న ఓటరు తనను అమ్ముకోవడమే కాదు తమ బిడ్డలజీవితాలను, ఆ తరువాత తరాలను కూడా అవినీతి రాజకీయనాయకులకు అమ్మేస్తుండడం కడుపు తరుక్కుపోయే దౌర్భాగ్య పరిస్థితి.

ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న వారు అడ్డదిడ్డంగా డబ్బులు పాంప్లేట్లలో పెట్టిమరీ పంచుతుంటే అడిగేనాదుడే లేదు. డబ్బుతో ఓటరునే ఓటరు భవిష్యత్తుని కూడా కొనేయొచ్చు అని నిరూపించేసుకుంటున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక చూస్తుంటే మాటలు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజకీయ అవినీతి ప్రగతిని నాశనం చేయడమే కాదు, వివేకమున్న తెలుగు ఓటరు ఇంతటి మూర్ఖత్వంలో బ్రతుకుతున్నారా అనే ప్రశ్న తలెత్తక మానదు. దీనికి కారణం డబ్బు తీసుకొని ఓటు వేసే ప్రతి మూర్ఖుడు. ఓటు వేయడానికి సమయం లేదని కుంటిసాకులు చెప్పే చదువుకున్న సోమరిపోతు.

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com