చిరు సినిమా బాలీవుడ్ సంగీత దర్శకుడి ఆసక్తి

మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమా లకు అందించిన బప్పీ లహరి, చిరు 150 వ సినిమా కు పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు. ఈ సినిమా లో ఒక్క పాట కు చాన్స్ ఇచ్చిన పని చేస్తానని తెలిపాడు. మెగాస్టార్ తో కలిసి పని చేయడం సంతోషాన్ని కలిగించే విషయం అన్నాడు.

సంగీతమే  కీలకం …

మెగాస్టార్ చిరంజీవి , విజయశాంతి జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ . ముఖ్యంగా గ్యాంగ్ .. గ్యాంగ్ అనే పాట ఇప్పటికి శ్రోతలను అలరిస్తుంది . ఇక రౌడీ అల్లుడు సినిమా లోని పాటలు కూడా దాదాపుగా సినీ సంగీత అభిమానులందర్నీ అలరించాయి .
ఈ రెండు సినిమాలకు సంగీతం అందించింది బప్పీ లహరి .

150 వ సినిమా చాన్స్ ఇస్తాడా ?

చిరు నటించనున్న 150 వ సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతలను చేపట్టాలని ఉందని ఈ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ , ఆయన అప్పగిస్తారా ? అన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే తెలుగులో ఈ మధ్య బప్పీ లహరి చేసిన సినిమాలు అంటూ లేకపోవడం తో, తెలుగు లో దేవిశ్రీ ప్రసాద్ , థమన్ వంటి యువ సంగీత దర్శకులు అద్బుత స్వరాలు సమకూర్చు తుండడం తో ఆయన చాన్స్ దక్కక పోవచ్చునని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

కత్తి రీమేక్ లో మెగాస్టార్

తమిళం లో ఘన విజయం సాధించిన కత్తి సినిమా ను మెగాస్టార్ 150 వ చిత్రంగా రీమేక్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించాడు. ఈ సినిమా నిర్మాణం లో లైకా ప్రొడక్షన్ భాగస్వామిగా వ్యవహరించనుంది. వివి వినాయక్ రూపొందించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com