రచ్చ కెక్కిన మంత్రుల విభేదాలు

ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి . విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు తారస్థాయి కి చేరుకోగా, అనంతపురం జిల్లా మంత్రులు పరిటాల సునీత, రఘునాథ్ రెడ్డి మధ్య విబేధాలు రచ్చ కెక్కాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ల కు అందించనున్న చంద్రన్న కానుక బ్యాగ్ లపై తన పోటో పై ముద్రించక పోవడం పై పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఫిర్యాదు చేయాలని రఘునాథ్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గతం లోనూ ఇదే పరిస్థితి
గతం లో సంక్రాంతి, రంజాన్ పండుగల సందర్భంగా పంపిణీ చేసిన చంద్రన్న కానుక బ్యాగ్ లపై తన పోటో ముద్రించక పోవడాన్ని రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇక భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అయినా క్రిస్మస్ చంద్రన్న కానుక బ్యాగ్ లపై రఘునాథ్ రెడ్డి పోటో లేకపోవడం వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉన్నదని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఆధిపత్య పోరు
అనంతపురం జిల్లా లో తమ పట్టు నిరుపించు కునేందుకు మొదటి నుంచి ఇద్దరు మంత్రులు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది . జిల్లా లో తన పట్టు నిరూపించుకునేందుకు మంత్రి సునీత గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రఘునాథ్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తుండగా, వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సునీత వర్గీయులు కొట్టి పారేస్తున్నారు.

పార్టీకి ఇబ్బందులు

ఇద్దరి మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పై ముఖ్యమంత్రి దృష్టి సారించక పోవడం పై జిల్లా నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా లో భవిష్యత్తు లో పార్టీ కి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com