అనుష్క ‘సైజ్ జీరో’ రివ్యూ

ప్రధానతారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ఊర్వసి, ప్రకాష్ రాజ్, అడివి శేష్, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, ఆలీ తదితరులు
ఛాయాగ్రహణం: నిరవ్ షా
మాటలు: కిరణ్
సంగీతం: కీరవాణి
కథ – స్క్రీన్ ప్లే: కనిక థిల్లాన్
నిర్మాత: పొట్లూరి వరప్రసాద్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి


సౌత్ ఇండియా సినిమాలో ఓ గుర్తింపు, స్థాయిని సంపాదించుకున్న నటులలో అనుష్క ని మొదటివరుసలో చేర్చవచ్చు.Embedded image permalink  అనుష్క ‘సైజ్ జీరో’ రివ్యూ CU0jnIgUAAAfgud ఆమె నటించిన అరుంధతి, వేదం, బాహుబలి, రుద్రమదేవి సినిమాలు ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్ళాయో చెప్పేదేముంది..తెలిసిందే కదా. ఇక తాజాగా మరో ప్రత్యేకమైన ‘సైజ్ జీరో’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కోసం ఆమె దాదాపు 20 కేజీల శరీర బరువును పెంచింది. మరి ఈ చిత్రం ఏమేర ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.

కధేంటి?

సౌందర్య (అనుష్క) తనకున్న అధిక బరువుతో నానా తంటాలు పడుతుంటుంది. ఆమెకు స్వీటీ అనే ముద్దు పేరూ ఉంటుంది. బొద్దుగా ఉన్న ఆమెను పెళ్ళాడడానికి ఎవరూ ముందుకు రారు. చూడ్డానికి వచ్చిన అబ్బాయిలు కూడా ఆమె బరువును చూసి పారిపోతుంటారు. ఇలా చూడ్డానికి వచ్చిన వారిలో అభి (ఆర్య) ఒకరు. అభిని స్వీటీ ఇష్టపడుతుంది. కానీ అభి మాత్రం స్లిమ్ గా ఉండే సిమ్రన్ (సోనాల్ చౌహాన్) ను ఇష్టపడతాడు. తన భారీకాయం వల్లనే తనను అభి ఇష్టపడలేదని భాధ పడుతుంది స్వీటీ. ఇక తన టార్గెట్ బరువును తగ్గించుకోవడమే. ఆ పనిలో భాగంగా సైజ్ జీరో క్లినిక్ లో చేరి తంటాలు పడుతుంది స్వీటీ. ఆ తరువాత తను అనుకున్నట్లు సన్న బడిందా? ఆమె టార్గెట్ ను చేరుకుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగితా కధ.

నటనా ప్రతిభ:

ఇలాంటి ఒబెసిటీ పాత్రను ఎంచుకోవడం…దానికి తగ్గ మార్పులు శరీరాకృతిలో చేసుకోవడం… ఇదంతా గ్లామర్ పాత్రలు చేస్తున్న నటీమణులకు ఓ రిస్క్ ఫీట్ అనే చెప్పాలి. అలాంటి పాత్రకు అనుష్క ఓకే చెప్పడం నిజంగా అభినందనీయం. ఇక పాత్రలోనూ స్వీటీ నే కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది. పాత్రకు తగ్గట్టు ఆమె హావభావాలను పండించడంలో శభాష్ అనిపించుకుందనే చెప్పాలి. అభి పాత్రకు ఆర్య మంచిగానే సూట్ అయ్యాడు. ఆ పాత్రను ఇంకా అందంగా తీర్చే అవకాసం ఉంది…అయినా తన ఈజ్ తో రాణించాడు. గ్లామర్ పాత్రలో చేసిన సోనాల్ చౌహాన్ బాగానే ఆకట్టుకొని మంచి మార్కులే కొట్టేసింది. ప్రకాష్ రాజ్ తన ప్రతినాయకుడి పాత్రను సునాయాసంగా లాగించేశాడు. తల్లి పాత్రలో నటించిన ఊర్వశి ఆదరగోట్టేసింది. ఆమె గురించి తెలిసిందే కదా!. మిగిలిన పాత్రల్లో చేసిన అడవి శేష్, బ్రహ్మానందం, ఆలీ, పోసాని అలా అలా లాగించేశారు.

టెక్నికల్ టీం:

ఈ చిత్రానికి భాణీలను అందించిన కీరవాణి పరవాలేదనిపించారు. నేపధ్య సంగీతానికి మాత్రం మంచి మార్కులే వేయొచ్చు. ఎందుకంటే ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. నిరవ్ షా ఛాయాగ్రహణం ‘సైజ్ జీరో’ కి మంచి ప్లస్. పీవీపీ బ్యానర్ కాబట్టి నిర్మాణ విలువలూ ఓకే. కధ విషయంలో కనిక సక్సెస్ అయినా…స్క్రీన్ ప్లే మెరిపించ లేకపోయాడు. ఇక దర్శకుడు ప్రకాష్ తన స్లో నెరేషన్ తో పెదవి విరిచేలా చేశాడు.

ముగింపు:

కధలో పట్టుంది. అనుష్క చేసిన రిస్కూ కనిపించింది. స్క్రీన్ ప్లే మసకబారింది. దర్శకత్వం పెదవి విరిచేలా చేసింది. అయినాకానీ అనుష్క ఒంటి చేత్తో సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ క్రెడిట్ అనుష్కాకే చెందుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

చివరిగా: పట్టున్న కధే…మరి స్క్రీన్ ప్లే? అయినా ‘స్వీటీ’ లాగించేసింది!

రేటింగ్: 3.0/ 5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com