తెరపైకి మళ్ళీ మల్టీ స్టారర్…ఈ దర్శకుడు హీరోలను ఒప్పించగలడా?

తన కెరీర్ కొద్దిగా స్లో అయింది అని అనుకుంటున్న సమయం లో ” భలే భలే మగాడివోయ్ ” సినిమా తో ఊహించని విధంగా పెద్ద సూపర్ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు దర్శకుడు మారుతి.

పూర్తి హాస్య భరితమైన సినిమాతో ఈ రకంగా హిట్ కొట్టచ్చు అని నిరూపించాడు కూడా. భలే భలే మగాడివోయ్ సినిమా దెబ్బ తో పెద్ద దర్శకుల సరస కి చేరుకున్నాడు మారుతి. ఇప్పటికే అల్లు అరవింద్ నుంచి రెండు ఆఫర్ లు, దిల్ రాజు నుంచి ఒక ఆఫర్ మారుతి కి దక్కింది అని సమాచారం. ఈ సినిమా సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చెయ్యడం లో బిజీ గా ఉన్న మారుతి ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు.

ఈ మధ్య తన నిర్మాతలు అయిన అల్లూ అరవింద్, యూ వీ క్రియేషన్స్ వారితో మాట్లాడుతూ ఇక తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో ఉందని, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ల కోసం తనవద్ద స్క్రిప్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని మారుతి చెప్పడం సంచలనం గా మారింది. ఇద్దరినీ కలిపి ఒకే తెర మీద చూడాలి అనుకునే వారికి తన వద్ద ఉన్న స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అని, వారిద్దరినీ డైరెక్ట్ చేసే అవకాసం వస్తే అంతకంటే ఇంకేం కావాలి అని మారుతి అన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తెలెత్తుతున్న ప్రశ్నంతా…ఈ దర్శకుడు ఈ స్టార్ లను ముల్టీ స్టారర్ సినిమా కు ఒప్పించగలడా? అని. మరో పక్క ఆ హీరోల చేత ఒకే అనిపించగల స్క్రిప్ట్ ఉంటే ఇది జరగడానికి ఎంతో కాలం పట్టదని అని అనేవాళ్ళూ లేకపోలేదు.  

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com