పవన్ పిలుపుతో ఊపందుకుంటున్న చేరికలు!

A Huge Response for JanaSena In Telangana State janasena పవన్ పిలుపుతో ఊపందుకుంటున్న చేరికలు! janasena9
A Huge Response for JanaSena In Telangana State

తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కి సిద్ధంక‌మ్మంటూ జ‌న‌సేన అధినేత పిలుపునివ్వ‌గా..పార్టీలోకి చేరికలు భారీస్థాయిలో ఊపందుకున్నాయి.

పార్టీకి బ‌లం ఉన్న స్థానాల్లో పోటీ చేసేస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు తేల్చేశారు. జాయినింగ్స్ అనంత‌రం కొత్త శ్రేణుల‌ని ఉద్దేశించి మాట్లాడిన మ‌హేంద‌ర్‌రెడ్డి, శంక‌ర్‌గౌడ్‌లు., జ‌న‌సేన పార్టీలో పెద్ద పెద్ద లీడ‌ర్లు లేక‌పోయినా., కార్య‌క‌ర్త‌లే లీడ‌ర్లుగా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.. తాము కార్య‌క‌ర్త‌ల స్థాయి నుంచే ఎదిగామ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు..ఇలాంటి అవ‌కాశం కేవ‌లం జ‌న‌సేన పార్టీలో మాత్ర‌మే ఉంద‌న్నారు.. ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్టు, ప్ర‌తిభ ఆధారంగా రాజ‌కీయంగా ఎద‌గ‌డానికి పార్టీ అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశ‌యాల‌కు అనుగుణంగా క‌లిసి న‌డుద్దామంటూ పిలుపునిచ్చారు.

రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం, పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకువ‌చ్చేలా జ‌న‌సేన అధినేత విధివిధానాల‌కు రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు పార్టీ నేత‌లు వెల్ల‌డించారు.

పార్టీలో చేరిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకూ, పార్టీని బ‌లోపేతం చేసేందుకు త‌మ శ‌క్తి మేర‌కు కృషి చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

తెలంగాణ‌లో పార్టీ స‌భ్య‌త్వాలు ల‌క్ష‌ల సంఖ్య‌కు చేర‌డంతో., ఇక్క‌డా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసిరేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com