సెలబ్రెటీలకు భారీగా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా

తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రైతు ఆత్మహత్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

రైతు ఆత్మహత్యలపై విచారణ జరిపి వారికి నష్టపరిహారం అందించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపిన నేపధ్యంలో ప్రభుత్వం పై హైకోర్ట్ ఆగ్రహాన్ని వ్యకం చేసింది.

సెలబ్రెటీలకు భారీగా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు నిలదీసినట్లు తెలుస్తుంది.

దీనిపై రెండు వారాల్లోగా పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com