వరిమొక్క పై సూక్ష్మక్రిమి దాడిని నిర్వీర్యంచేసే ప్రయోగం సఫలం!

వరి మొక్క పై సూక్ష్మక్రిమి దాడి ని నిర్వీర్యం చేసే ప్రయోగం లో సానుకూల ఫలితాన్ని సాధించిన సిఎస్ఐఆర్- సిసిఎం బి శాస్త్రవేత్తలు

వరి మొక్క పై జాంతొమోనస్ ఒరిజే అనే సూక్ష్మక్రిమి దాడి చేసేటపుడు మొక్క అవలంబించే దాడి నిరోధక పద్ధతి లో ఒక రకం మార్పు ను తాము కనుగొనగలిగినట్లు హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజి (సిఎస్ఐఆర్- సిసిఎం బి)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ హితేంద్ర కె. పటేల్,   డాక్టర్ రమేశ్ వి. శొంటి లు తెలిపారు. 

ఎక్స్ఒపిక్యు అనే నామం కలిగిన బాక్టీరియల్ ఇఫెక్టర్ వరి మొక్క తాలూకు కణాల లో 14-3-3 మాంసకృత్తులు గా వ్యవహారం లో ఉన్న కణాల మీద దాడి చేసినప్పుడు మొక్క లోని రక్షిత వ్యవస్థ కు, సూక్ష్మక్రిమి కి మధ్య బలాబలాల్లో ఏది పైచేయి ని సాధిస్తుందన్న దాని పైన ఆ దాడి బారి నుండి మొక్క తనను తాను కాపాడుకోగలిగేదీ, లేక కాపాడుకోలేనిదీ తేలుతూ వస్తోంది. 

ఈ క్రమం లో, సిఎస్ఐఆర్- సిసిఎం బి శాస్త్రవేత్తలు ఇఫెక్టర్ ప్రొటీన్ యొక్క అనుక్రమాన్ని ఒక ఫలానా దశ వద్ద మార్చివేశారు.  ఈ దిద్దుబాటు, వరి మొక్క కు ఉన్న సూక్ష్మక్రిమి దాడి నిరోధక ప్రతిస్పందనల అణచివేత ను నీరుగార్చిందని, దానికి బదులుగా ఈ పరివర్తన మరొక 14-3-3 మాంసకృత్తుల తో పరస్పర చర్య కు లోనై మొక్క ను సూక్ష్మక్రిమి కి లోబడనటువంటిది గా తయారు చేసిందని శాస్త్రజ్ఞుకలు గుర్తించారు. 

మొక్క లో సంరక్షణ దారు భూమిక ను పోషించే కణాల ను గురించి మరింత లోతు గా అర్థం చేసుకోవడం వల్ల, బాక్టీరియల్ హైజాక్ ను అడ్డుకోవడంలో కొత్త దారులను గురించి తెలియడం తో పాటు మొక్క కణజాలం లో రక్షణ సంబంధ ప్రతిచర్యల ను పటిష్టపరచడం కూడా సాధ్యపడుతుంది. 

ఈ అధ్యయనం లో గుర్తించిన అంశాల ను బ్రిటిష్ సొసైటీ ఫర్ ప్లాంట్ పాథాలజీ ప్రచురిస్తున్న జర్నల్ మాలిక్యులర్ ప్లాంట్ పాథాలజీ లో ముద్రించడమైంది.  ఈ విషయాన్ని సిఎస్ఐఆర్- సిసిఎం బి ఒక ప్రకటన లో వివరించింది. 

వరి పంట భారతదేశం లో అత్యంత ముఖ్యమైన పంటలలో ఒకటి గా ఉంది.  జాంతొమోనస్ ఒరిజే క్రిమిదోషం వరి మొక్కల కు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది.  ఈ వ్యాధి కారణంగా రైతులు వారి యొక్క పంటల లో 60 శాతం వరకు పంటల ను నష్టపోయే ప్రమాదం దాపురిస్తోంది. 

తాజా గా సిఎస్ఐఆర్- సిసిఎం బి శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనం ఫలితాలు భవిష్యత్తు లో వరి రైతుల కు ఈ సాంక్రామిక వ్యాధి నుంచి ఉపశమనాన్ని ప్రసాదించే దిశ లో ముందంజ వేయగలుగుతాయని ఆశించవచ్చు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com