మొదటిసారిగా ‘ఫిలిం క్రిటిక్’ కోర్సును ప్రవేసిపెట్టిన సంస్థ!

ఫిల్మ్ క్రిటిసిజ‌మ్‌ అండ్ ది ఆర్ట్ ఆఫ్ రివ్యూ లో తొలి సారిగా ఒక కోర్సు ను నిర్వహించనున్న ఎఫ్‌టిఐఐ

 

     పుణె లోని ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) మ‌రొక కొత్త అధ్యాయానికి నాంది ప‌లికింది.  మొట్ట‌మొద‌టి సారిగా చ‌ల‌న చిత్రాల విమ‌ర్శ మ‌రియు స‌మీక్ష‌ క‌ళ లో ఒక కోర్సు ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

     20 రోజుల పాటు ఉండే ఈ కోర్సు ను ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ క‌మ్యూనికేష‌న్ (ఐఐఎంసి), ఢిల్లీ స‌హ‌కారం తో ఈ సంవ‌త్స‌రం మే 28వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వ‌ర‌కు ఢిల్లీ లో నిర్వ‌హించ‌నున్నారు.

     ఈ కోర్సును గురించిన వివ‌రాల‌ను ఎఫ్‌టిఐఐ డైరెక్ట‌ర్ శ్రీ భూపేంద్ర కైంతోలా తెలియ‌జేస్తూ, ఈ తరహా కోర్సు అవ‌స‌ర‌మ‌న్న డిమాండుచ‌ల‌న చిత్ర విమ‌ర్శ‌కులు, స‌మీక్ష‌కులు, ప‌రిశోధ‌క విద్యార్థులు ఫిల్మ్ అక‌డ‌మిక్స్, ఫిల్మ్ బ్లాగ‌ర్స్‌ తో పాటు చ‌ల‌న చిత్రాల పై అమిత‌ ఆస‌క్తి ని క‌లిగి ఉన్న‌ మ‌రెవ్వ‌రి నుంచైనా ఎంతో కాలం గా ఉంటూ వచ్చిందని ఆ డిమాండు ను ఈ కోర్సు నెర‌వేరుస్తుంద‌న్నారు.  ఒక చ‌ల‌న చిత్రాన్ని స‌మీక్షించాలంటే, ఆ చ‌ల‌న చిత్రాన్ని ఏ విధంగా ‘చ‌ద‌వాలో’ తెలుసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని, దీనికి త‌గిన‌టువంటి ఉప‌క‌ర‌ణాల‌ను ఈ కోర్సు ద్వారా స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

      ఈ కోర్సు కు భోపాల్ కేంద్రం గా కృషి చేస్తున్న ర‌జులా షా సార‌ధ్యం వ‌హించ‌నున్నారు.  ఆమె ఎఫ్‌టిఐఐ లో పూర్వ విద్యార్థిని.  1997 నుంచి 2000వ సంవ‌త్స‌రం మ‌ధ్య కాలం లో ఎఫ్‌టిఐఐ లో చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌క‌త్వాన్ని ఆమె అభ్య‌సించారు.  ఈ క్ర‌మం లో ఆమె వివిధ నిపుణుల తో క‌ల‌సి ప‌ని చేసి, ఎన్నో విష‌యాల‌ను నేర్చుకొన్నారు. చలనచిత్ర కళ తో పాటు డిజిటల్ ఆర్ట్స్ పరిధులను విస్తరింపచేయడం పట్ల ఆమె ప్రత్యేకమైన ఆసక్తి ని కనబరిచారు.

     ఈ కోర్సును గురించి రజులా షా చెప్తూ, దీని ని చ‌ల‌న చిత్రాల విమ‌ర్శ‌ విభాగం లో ఒక పూర్వ రంగాన్ని అందించేట‌ట్లుగా, ఇంకా ఈ కోర్సు లో భాగం పంచుకొనే వారిని చ‌ల‌న చిత్రాల ప‌ట్ల లోతైన అధ్య‌య‌నం చేసేవారుగా తీర్చిదిద్దడం కోసం ఉద్దేశించామ‌ని తెలిపారు.  సినిమా చ‌రిత్ర లోని గొప్ప చిత్రాల అధ్య‌య‌నం కూడా ఈ కోర్సులో ఒక భాగం గా ఉంటుంద‌ని ఆమె తెలిపారు.

        స్కిల్లింగ్ ఇండియా ఫిల్మ్ ఎండ్ టెలివిజన్ (ఎస్ కెఐఎఫ్ టి) కింద ఎఫ్‌టిఐఐ యొక్క దేశ‌వ్యాప్త చ‌ల‌న చిత్ర విద్య వ్యాప్తి కార్య‌క్ర‌మం లో భాగం గా ఈ కోర్సును నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.  దీని కోసం ముందస్తుగా దేశమంతటా 37 న‌గ‌రాల లోని 5800 మంది కి పైగా 135 కన్నా అధిక సంఖ్యలో స్వల్ప కాలిక కోర్సు లను పూర్తి చేయడమైంది.

     ఈ కోర్సు లో ఎవ‌రైనా చేరేందుకు అవ‌కాశం ఉంటుంది.  దీనికి వ‌యో ప‌రిమితి అంటూ ఏమీ లేదు.  దీనిలో చేరేందుకు ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్ 22 ఆఖ‌రు తేదీ.  ఢిల్లీ వెలుప‌ల నుండి వ‌చ్చే వారిలో ఎంపిక చేసిన కొంతమందికి వారు అభ్య‌ర్ధించిన మీద‌ట వ‌స‌తిని క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.  ఇత‌ర వివ‌రాలు www.ftii.ac.in లో అందుబాటులో ఉన్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com