మాద‌క ద్ర‌వ్యాల ఉత్ప‌త్తుల‌ అక్ర‌మర‌వాణా నిరోధానికి ఇండోనేశియా తో భారత్ ఒప్పందం!

మాద‌క ద్ర‌వ్యాలు, సైకోట్రాపిక్ ప‌దార్థాలు, వాటి అనుబంధ ఉత్ప‌త్తుల‌ అక్ర‌మ ర‌వాణా నిరోధాని కి భారతదేశం, ఇండోనేశియా ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

మాద‌క ద్ర‌వ్యాలు, సైకోట్రాపిక్ ప‌దార్థాలు, వాటి అనుబంధ ఉత్ప‌త్తుల‌ అక్ర‌మ ర‌వాణా నిరోధాని కి భారతదేశం, ఇండొనేశియా ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సంతకాల కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎంఒయు మాద‌క ద్ర‌వ్యాలు, సైకోట్రాపిక్ ఉత్ప‌త్తుల అక్ర‌మ ర‌వాణా ను నిరోధించ‌డానికి ప‌రస్ప‌ర స‌హ‌కారాని కి ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఈ ఎంఒయు పై సంత‌కాలు జ‌రిగిన నాటి నుండి ఇది 5 సంవ‌త్స‌రాల పాటు అమ‌లు లో ఉంటుంది.

భారతదేశం మ‌రో 37 దేశాల‌ తో ఇటువంటి ఎంఒయుల ను/సంధులను/ ఒప్పందాలను కుదుర్చుకొంది.

ఈ అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రం లోని ముఖ్యాంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

మాద‌క ద్ర‌వ్యాలు, సైకోట్రాపిక్ ప‌దార్ధాలు, వాటి ఉపఉత్ప‌త్తుల విష‌యంలో ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల నిరోధ ఒప్పందాల‌కు అనుగుణంగా , మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణాను నిరోధించేందుకు ఉభ‌య‌దేశాల మ‌ధ్య మ‌రింత  మెరుగైన స‌హ‌కారానికి ఈ అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది.  ఈ అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం లో భాగం గా ఉభ‌య‌ దేశాల‌ లో మాద‌క ద్ర‌వ్యాలు,  సైకోట్రాపిక్ ఉత్ప‌త్తులు, ఇత‌ర అనుబంధ ఉత్ప‌త్తుల‌ అక్ర‌మ‌ ర‌వాణా ను అరిక‌ట్టేందుకు గ‌ల జాతీయ స్థాయి చ‌ట్టాల గురించిన సమాచారాన్ని ప‌ర‌స్ప‌రం ఇచ్చి  పుచ్చుకుంటారు.  అలాగే మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ‌ ర‌వాణా దారుల‌ ను గుర్తించేందుకు, మ‌నీ లాండ‌రింగ్‌ను నిరోధించేందుకు  అక్ర‌మ‌ ర‌వాణా తో ముడిప‌డిన ర‌సాయానాల అక్ర‌మ ర‌వాణా ను నిరోధించేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ కు ఈ ఎంఒయు ఉప‌క‌రిస్తుంది.

ఈ ఎంఒయు లో భాగం గా, ఈ ఎంఒయు కు అనుగుణం గా సేక‌రించిన స‌మాచారం మరియు డాక్యుమెంట్ ల విష‌యం లో ర‌హ‌స్యాన్ని పాటించేందుకు ఇందులో ఒక నిబంధ‌న ను చేర్చడమైంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com