ప్లాస్టిక్ పరిశ్రమలో విస్తృత అవకాశాలు!

ప్లాస్టిక్ పరిశ్రమలో విస్తృత అవకాశాలు – సిఐపిఇటి డైరెక్టర్ ఎ వి ఆర్ కృష్ణ‌ ప్లాస్టిక్ మన జీవిత౦లో ఓ భాగ౦, ఈ ర౦గ౦ ద్వారా ఉపాధి అవకాశాలు- టి.వి.కె రెడ్డి
ఈ సంవత్సరం జులై 7వ తేదీ న సిఐపిఇటి జెఇఇ 

– దరఖాస్తుల ను ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు

 

ఉదయ౦ బ్రష్ దగ్గరి ను౦చి మన దైన౦దిన జీవిత౦లో ప్లాస్టిక్ ని వాడుతామని, ప్లాస్టిక్ వాడక౦ లేనిదే మన రోజు వారీ కార్యక్రమాలు కూడా జరగవని పత్రికా సమాచార కార్యాలయ౦ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ టి.వి.కె రెడ్డి అన్నారు.

ఈ రోజు కవాడిగూడ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ౦లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశ౦లో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కి డిమా౦డ్ ఏర్పడడ౦ వలన సా౦కేతికత వినియోగ౦ పెరుగుతు౦దని, వీటి ద్వారా మరి౦త ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశము౦దని అభిప్రాయపడ్డారు. 

సెంట‌ర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ (సిఎస్‌టిఎస్) డైరెక్టర్  ఎ వి ఆర్ కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ ర౦గ౦ ద్వారా విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. ప్లాస్టిక్ వాడక౦ గురి౦చి ప్రజలలో, సమాజ౦లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయని, ప్లాస్టిక్ ని సరైన విధ౦గా వాడేలా ప్రజలలో తమ స౦స్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సెంట‌ర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ (సిఎస్‌టిఎస్‌)  భార‌త ప్ర‌భుత్వ సంస్థ‌ లలో ఒకటి. 

ర‌సాయ‌నాలు మ‌రియు ఎరువుల మంత్రిత్వ శాఖ లోని ర‌సాయ‌నాలు మ‌రియు పెట్రో ర‌సాయ‌నాల విభాగం ఆధ్వ‌ర్యం లో 1987వ సంవ‌త్స‌రం లో ఈ సంస్థ ను హైద‌రాబాద్ లో స్థాపించారు.  ఈ ప్రాంతం లోని ప్లాస్టిక్స్ మ‌రియు సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల కు శిక్ష‌ణ ను, సాంకేతిక సేవ‌ల‌ ను ఈ సంస్థ అందిస్తోంది.  వినియోగ‌దారు సంస్థ ల అవ‌స‌రాల‌ ను నెర‌వేర్చ‌డం కోసం అత్య‌ధునాత‌న‌మైన డిజైన్‌, సిఎడి/సిఎఎం/సిఎఇ/ టూలింగ్, ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్, టెస్టింగ్ డిపార్ట్‌ మెంట్స్ సంబంధిత స‌దుపాయాల‌ ను ఈ కేంద్రం లో సమకూర్చారు.  చ‌ర్ల‌ప‌ల్లి ఐడిఎ లో గ‌ల ఈ సంస్థ కేంప‌స్ లో పూర్తి స్థాయి సౌక‌ర్యాల‌ తో పాటు బాల బాలిక‌ల‌ కు వ‌స‌తి గృహాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

 సిఐపిఇటి దేశం లోని ఒక ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ మాత్ర‌మే కాక పాలిమ‌ర్ సైన్స్, ఇంకా టెక్నాల‌జీ వంటి ప్ర‌త్యేక రంగాల లో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి ల‌కు గాను, ప్ర‌పంచ శ్రేణి సంస్థ గా కూడా పేరు తెచ్చుకొంది.  సిఐపిఇటి కి ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్‌, మ‌రియు టెక్నాల‌జీ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కోర్సుల‌ ను రూపొందించ‌డం, అభివృద్ధిప‌ర‌చ‌డం, మ‌రియు నిర్వ‌హించ‌డం లో ఐఎస్ఒ 9001:2015 క్యుఎంఎస్‌, ఐఎస్ఒ/ఐఇసి – 17025, ఇంకా ఐఎస్ఒ/ఐఇసి – 17020 ధ్రువీక‌ర‌ణ‌ల గుర్తింపు లు ఈ సంస్థ కు ఉన్నాయి. 

ప్లాస్టిక్స్ ఇంకా సంబంధిత ప‌రిశ్ర‌మల కు ల‌బ్ది ని అందించే లక్ష్యం తో డిజైన్‌, టూలింగ్‌, ప్లాస్టిక్‌, ప్రాసెసింగ్ మ‌రియు టెస్టింగ్ ల‌లో సాంకేతిక‌ప‌ర‌మైన, ఇంకా క‌న్స‌ల్టెన్సీ ప‌ర‌మైన సేవ‌ల‌ ను ఈ సంస్థ అందిస్తోంది.  దీనికి తోడు ఉపాధి లేన‌టువంటి యువ‌త తో పాటు త‌గినంత‌ గా ఉపాధి లేన‌టువంటి యువ‌త కు ఉద్యోగ అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డం లో, వివిధ నైపుణ్య అభివృద్ధి సంబంధిత శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల ద్వారా న‌వ పారిశ్రామికుల కు ప్రోత్సాహాన్ని ఇవ్వ‌డం లో, అలాగే ఎస్‌టిఎఆర్ కార్య‌క‌లాపాల‌ లో కూడా ఒక ప్ర‌త్యేక పాత్ర‌ ను సిఐపిఇటి పోషిస్తోంది.

ఎఐసిటిఇ ఆమోదం క‌లిగిన దిగువన పేర్కొన్న దీర్ఘ‌ కాల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని సిఐపిఇటి : సిఎస్‌టిఎస్ లో  నిర్వ‌హిస్తున్నారు.   ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం లో ఈ సంస్థ లో 532 మంది శిక్ష‌ణార్థులు ఉన్నారు. 

 

వరుస సంఖ్య కోర్సు పేరు       వ్య‌వ‌ధి అర్హ‌త‌
1 పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ & టెస్టింగ్   (పిజిడి-పిపిటి) ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలు    ర‌సాయ‌నిక శాస్త్రం ఒక స‌బ్జెక్టు గా,   విజ్ఞాన  శాస్త్రం లో మూడు సంవ‌త్స‌రాల డిగ్రీ
2 పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ – సిఎడి/సిఎఎం (పిడి  -పిఎండి) తో పోస్ట్ డిప్లొమా ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలు మెకానిక‌ల్‌, ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ, టూల్‌/ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్‌, మెకాట్రానిక్స్‌, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌, టూల్ & డై మేకింగ్ లో మూడేళ్ళ డిప్లొమా, డిపిఎంటి/డిపి (సిఐపిఇటి) లేదా త‌త్సమాన‌మైన‌ది.
3 డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాల‌జీ (డిపిఎంటి) మూడు సంవ‌త్స‌రాలు      గ‌ణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మ‌రియు ఇంగ్లీషు స‌బ్జెక్టుల‌ తో టెన్త్ స్టాండ‌ర్డ్‌
4 డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ (డిపిటి) మూడు సంవ‌త్స‌రాలు   గ‌ణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మ‌రియు ఇంగ్లీషు స‌బ్జెక్టుల‌ తో టెన్త్ స్టాండ‌ర్డ్‌

 

పైన పేర్కొన్న కోర్సుల లో ప్ర‌వేశానికి ఎలాంటి వ‌య‌స్సు ప‌రిమితి లేదు.

పైన పేర్కొన్న దీర్ఘకాల కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు ల విక్ర‌యం ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద్వారా ఆరంభం అయింది. 

ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ కు ఆఖ‌రు తేదీ: 30.6.2019

సిఐపిఇటి జెఇఇ యొక్క తేదీ: 07.07.2019

పైన పేర్కొన్న కోర్సుల లో ప్ర‌వేశానికి ఎటువంటి వ‌య‌స్సు ప‌రిమితి లేదు

పైన పేర్కొన్న దీర్ఘకాల కోర్సుల‌ కు ద‌ర‌ఖాస్తు ల విక్ర‌యం ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద్వారా ఆరంభం అయింది. 

ద‌ర‌ఖాస్తుల దాఖలు కు ఆఖ‌రు తేదీ :  30.06.2019

ఆన్ లైన్ లో ఇక్కడ దరఖాస్తు చేసుకోండి :  eadmission.cipet.gov.in

సిఐపిఇటి జెఇఇ ని నిర్వహించే తేదీ :  07.07.2019

ప్ర‌స్తుత సంవ‌త్స‌రం 2018-19లో స్వ‌ల్ప‌ కాల కోర్సుల‌ కు సంబంధించి 1429 మంది శిక్ష‌ణార్థుల కు వివిధ స్వ‌ల్ప‌ కాల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ లో శిక్ష‌ణ ను ఇవ్వ‌డం జ‌రిగింది.  ఈ శిక్ష‌ణార్ధుల లో టైల‌ర్ మేడ్ కోర్సు ల‌కు చెందిన వారితో పాటు బిడిఎల్, జిఎఐఎల్‌, ఎంసిటి,ఎన్‌బిసిఎఫ్‌డిసి, త‌దిత‌ర సంస్థ‌లు స్పాన్స‌ర్ చేసిన వారు కూడా ఉన్నారు.  

ప్ర‌స్తుతం 80 మంది శిక్ష‌ణార్హులు రెండు వేరు వేరు స్వ‌ల్ప‌ కాల కార్య‌క్ర‌మాల లో శిక్ష‌ణ ను పొందుతూ ఉండ‌గా, మ‌రికొన్ని కోర్సు లు రూపకల్పన దశ లో ఉన్నాయని సిఐపిఇటి డైరెక్టర్  ఎ వి ఆర్ కృష్ణ అన్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com