పాలసీలపై పవన్ సవాలును స్వీకరించే సాహసం అధికార-ప్రతిపక్ష పార్టీ చేసేనా?

ప‌బ్లిక్ పాల‌సీ.. ప్ర‌జా పాల‌న కోసం రూపొందించే విధానాలు.. ఏసీ గ‌దుల్లో కూర్చుని ప్ర‌జ‌ల‌కి ఏం కావాలి..? రైతుల‌కి ఏం కావాలి..? విద్యార్ధుల‌కి ఏం కావాలి..? అన్న నిర్ణ‌యాలు తీసేసుకుంటే.. నోట్ల ర‌ద్దుతో సామాన్యుడి స‌మ‌యాన్ని బ్యాంకు క్యూల్లో వృధా చేసిన చందంగా.. అత్య‌వ‌స‌రానికి కూడా డ‌బ్బు దొర‌క్క జ‌నాన్ని నానా తిప్ప‌లు పెట్టిన చందంగా ఉంటుంది.. ఇబ్బందులు ప‌డితే ప‌డ్డారు.. ఆ నిర్ణ‌యంతో సాధించింది ఏమైనా ఉందా అంటే.. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ని ప‌ట్టారు.

మ‌రి ప‌బ్లిక్ పాల‌సీలు ఎలా వ‌స్తాయి.. నీరు లేని పొలంలో బూట్ల‌తో దిగి నాట్లు వేస్తే వ‌స్తాయా..? లేక ఎవ‌డికో పుట్టిన బిడ్డ‌కి మా ఇంటి పేరు పెట్టుకుంటామంటూ., ప‌రిష్కార‌మైన ప్ర‌తి స‌మ‌స్య మా చ‌ల‌వే అని చెప్పుకు తిరిగితే వ‌స్తాయా..? లేక నేనే సిఎం.. నేనే సిఎం అంటూ రోడ్ల వెంట తిరిగితే వ‌స్తాయా..?

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలియాలంటే.. ప్ర‌జ‌ల అభివృద్ది కోసం పాల‌సీల‌కి రూప‌క‌ల్ప‌న చేయాలంటే.. ముందుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.. స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉన్నాయో అక్క‌డికి వెళ్లాలి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవ్వాలి.. రైతులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, డ్రైవ‌ర్లు, ఇంకా కుల‌వృత్తుల వారు.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌వాలి.. అవ‌స‌రం అనుకున్న చోట వారి స‌మ‌స్య ఉన్న చోటుకే వెళ్లాలి.. ఇప్పుడే ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తెలుస్తాయి.. వారికి ఏం కావాలో తెలుస్తుంది.. అప్పుడే ఖ‌చ్చిత‌మైన ప్ర‌జా విధానాలు.. ప్ర‌జ‌ల‌కి ప్ర‌యోజ‌నం చేకూర్చే విధానాల రూప‌క‌ల్ప‌న సాధ్య‌ప‌డుతుంది.. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఈ విధ‌మైన విధానాల‌తో ముందుకి వెళ్తున్న ఏకైక పార్టీ జ‌న‌సేన అన‌డం నిర్వివాదాంశం.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర తీరు చూస్తుంటే., అదే అర్ధం అవుతుంది.. ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పేరిట పోరాటం మొద‌లు పెట్టినా., స‌మ‌స్య ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రికి తానే వెళ్తూ, స‌మ‌స్య‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి, ఆ స‌మ‌స్య ప‌రిష్కారానికి మేనిఫెస్టోలో చోటు క‌ల్పిస్తున్నారు.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌నలో మెజార్టీ శాతం ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్న అంశం వివిధ ప్రాజెక్టులు, ప‌రిశ్ర‌మ‌ల భూ నిర్వాసితులు.. అమరావ‌తికి వెళ్లినా, హైద‌రాబాద్ వెళ్లినా వారి స‌మ‌స్య గుర్తు పెట్టుకుని మ‌రీ 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు కోసం ఓ పోరాటానికి రూప‌క‌ల్ప‌న చేశారు.. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో సాగుతున్న పోరాట యాత్ర‌లో ఆటో డ్రైవ‌ర్ల ద‌గ్గ‌ర నుంచి రైతుల వ‌ర‌కు వివిధ వ‌ర్గాల‌తో మ‌మేక‌మైన ఆయ‌న‌.., ఏసీ గ‌దుల్లో పాల‌సీలు రాసే విధానానికి చ‌ర‌మ‌గీతం పాడారు.                                 

పెరుగుతున్న డీజిల్ ధ‌ర‌ల‌తో ఆటో వాలాలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని గ్ర‌హించిన ఆయ‌న స‌బ్సిడిపై బ్యాట‌రీ ఆటోలు ఇస్తామ‌ని తెలిపారు.. అగ్రి క‌ల్చ‌ర‌ల్ కో-ఆప‌రేటివ్ ఎంప్లాయిస్‌తో స‌మావేశం జ‌రిగినా, రెల్లి నాయ‌కుల్ని క‌లిసినా, ఉపాధ్యాయ సంఘాల‌ని క‌ల‌సినా., ప్ర‌తి అడుగులో పాల‌సీల రూప‌క‌ల్ప‌న చేస్తూ ముందుకి సాగుతున్నారు.. కులాల్ని క‌లిపే ఆలోచ‌నా విధానాన్ని పాఠ‌శాల స్థాయి నుంచే పునాధి వేయాలన్న సంక‌ల్పంతో జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కామ‌న్ స్కూల్ విధానం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ నిర్వాసితుల్ని క‌లిసిన సంద‌ర్బంలో., అక్క‌డిక‌క్క‌డ స్పాట్‌లో ఓ అద్భుత‌మైన పాల‌సీని ప్ర‌క‌టించారు.. ప్రాజెక్టులు, మ‌రే ఇత‌ర నిర్మాణాల కోస‌మైనా ప్ర‌భుత్వం భూములు సేకరించాల్సి వ‌చ్చిన‌ప్పుడు., రైతులు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించాలి.. ఒక వేళ ప‌రిహారం చెల్లించేందుకు ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బు లేని ప‌క్షంలో నిర్ణీత గ‌డువుతో కూడిన అప్పు ప‌త్రాలు (స‌ర్టిఫికెట్స్‌) ప్ర‌భుత్వం మీకు అప్పు ఉంద‌ని చెబుతూ రైతుల‌కి అందించాలి.. ఖ‌జానాలోకి డ‌బ్బు వ‌చ్చిన వెంట‌నే ఆ ప‌త్రాల‌కు న‌గ‌దు రూపం క‌ల్పించాలి.. ఇంత‌టి బ‌ల‌మైన ఆలోచ‌నా విధానం ఉంది కాభ‌ట్టే జ‌న‌సేన అధినేత ప్ర‌త్య‌ర్ధుల‌కి న‌డిరోడ్డు మీద నిల‌బ‌డి మ‌రీ స‌వాలు విసురుతున్నారు.. విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు కాదు.. ప్రజా క్షేత్రంలో ప‌బ్లిక్ పాల‌సీల మీద చ‌ర్చించుకుందాం రండి.. సిఎం అయినా, సిఎం త‌న‌యుడైనా, లేక సిఎం కావాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తి ప‌క్ష నేత అయినా.. మ‌రి జ‌న‌సేన అధినేత స‌వాల్‌ని స్వీక‌రించే ద‌మ్ము వారికి ఎప్పుడు వ‌స్తుందో..!

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com