పవన్ కళ్యాణ్, వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ మూవీ రివ్యూ

ముఖ్య తారాగణం: విక్టరీ వెంకటేష్‌, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, శ్రియ, మిథున్‌ చక్రవర్తి,, పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి, కృష్ణుడు తదితరులు
నిర్మాతలు           : సురేష్ బాబు దగ్గుబాటి, శరత్‌ మరార్‌
దర్శకత్వం           : కిషోర్‌ కుమార్‌ పార్థసాని (డాలీ)
మాటలు              : సాయిమాధవ్‌ బుర్రా
సంగీతం               : అనూప్‌ రూబెన్స్‌
కూర్పు                : గౌతంరాజు

విడుదల తేదీ: జనవరి 10, 2015

 

ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ రేంజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్, తన ట్రాక్ రికార్డు లో ఎన్నో విక్టరీ లను సొంతం చేసుకున్న వెంకటేష్ లు కలసి సినిమా చేస్తున్నారంటేనే అంచనాలు వాటంతట అవే భారీగా పెరిగిపోయాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్, ఆ తరువాత ట్రైలర్ లు విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన గురించి చెప్పాలంటే యు ట్యూబ్ , ఫేస్బుక్, తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ లే ప్రత్యక్ష సాక్షులు.

‘గోపాల గోపాల’ సినిమా హిందీ ‘ఓహ్ మై గాడ్’ నుంచి రీమేక్ చేసినప్పటికీ…తెలుగు ప్రేక్షకుడికి రీచ్ అవడడానికి తగిన మార్పులు, చేర్పులు చేసి అందిస్తారనేది అందరూ ఊహించిందే. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుందో చూద్దాం.

 

‘గోపాల గోపాల’ కథేంటి?

గోపాల రావు (వెంకటేష్ ) అనే నాస్తికుడు భక్తులకి దేవుడి మీద ఉన్న నమ్మకమే ప్రధాన పెట్టుబడిగా దేవుడి విగ్రహాలను అమ్ముకుంటూ తన వ్యాపారాన్ని నడిపించుకుంటుంటాడు. అయితే అతని భార్య మీనాక్షి ( శ్రేయ)కి దేవుడి మీద విపరీతమైన నమ్మకంతో తన భక్తిని చాటు కుంటూ ఉంటుంది.

ఈ క్రమంలో ఓ సందర్భంలో దేవుడి యొక్క ఉనికినే ప్రశ్నిస్తూ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళను అపహాస్యం చేస్తాడు. ఈ క్రమంలో భూకంపం సంభవించడంతో తన దుకాణం కూలిపోతుంది. అయితే ఈ విపత్తులో తన ఒక్క దుకాణమే నేలమట్టమవుతుంది.

దేవుడి చర్య వల్ల జరిగిన నష్టాన్ని ఇన్సురెన్స్ కంపెనీ చెల్లించడానికి ఒప్పుకోక పోవడంతో…తనకి జరిగిన నష్టానికి దేవుడే భాధ్యుడని, తన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు గోపాల్ రావు.

ఈ క్రమంలో దేవుడి దూతలుగా చెప్పుకునే స్వామీజలందరినీ కోర్టుకు లాగుతాడు. ఈ క్రమలో భక్తులు గోపాల రావు ను చంపాలని చూస్తుండడంతో… అప్పుడే భగవంతుడు మనిషి రూపంలో (పవన్‌కళ్యాణ్‌) వస్తాడు. భగవంతుడు గోపాల్ రావు ని కష్టాల నుంచి ఎలా కాపాడాడు.. గోపాల్ రావు కోర్టు లో దేవుడు మీద వేసిన కేసు ఏమైంది? … తనకు జరిగిన నష్టాన్ని ఎలా పూరించగాలిగాడు అనేవి మిగతా కధాంశం.

 

నటీనటుల నటనా ప్రతిభ:

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రధాన కధానాయకుడు కాగా, పవన్ కళ్యాణ్ ది ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే. ఈ సినిమాలో వెంకటేష్ నటనకు వస్తే…నాస్తికుడిగా, తోటివారికి సహాయం చేసే వాడిగా కబరిచిన నటనా పరితీరు భాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తనకున్న మేనరిజంకు తగ్గట్టు పాత్రను మలచుకొని పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు.

ఇక పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ నటన విషయానికి వస్తే…తనను తను ప్రెజెంట్ చేసుకున్న విధానం ప్రశంశ నీయం. ఇక ఈ సినిమాలో కధకు సూట్ అయ్యే పవర్ ఫుల్ డైలాగ్ లు కూడా ఉన్నాయి. వీటిని అభిమానులకు భాగా చేరవేశాడు. భగవంతుడికి ఉండవలసిన అభినయాన్ని ఆకట్టుకునే విధంగా ప్రదర్శించాడు.

మిథున్‌ చక్రవర్తి తన పాత్రని హావ భావాలతో అద్భుతంగా పోషించాడు. శ్రియ కి ఉన్న సన్నివేశాలు తక్కువే అయినా.. తన పరిధిలో భాగానే చేసింది.

ఇక పోసాని విషయానికి వస్తే వినోదాన్ని బాగానే పండించాడు. ఇక మిగిలిన పాత్రల్లో కృష్ణుడు, ఆశిష్‌ విద్యార్థి, తదితర నటులు తమ వంతు పాత్రను పోషించారు.

ఆకట్టుకునే అంశాలు:

పవన్‌కళ్యాణ్‌ అభినయం
వెంకటేష్ నటన
సంభాషణలు
దర్శకత్వం

నిరాశపరిచే అంశాలు:

వీక్ క్లైమాక్స్

 

టెక్నికల్ టీం వర్క్:

ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ నేపధ్యానికి తగ్గట్టు భాణీలను సమకూర్చి భాగానే ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఉన్న సంభాషణలు క్యారేక్టేర్లకు తగ్గట్టు భాగా సూట్ అయ్యి ప్రేక్షకులకు బాగా చేరుకుంటాయని చెప్పవచ్చు.

‘నమ్మించేవాడు నాయకుడు కాదు.. నడిపించేవాడు నాయకుడు’…‘సమర్ధుడు మనకెందుకు అనుకుంటే అసమర్ధుడు రాజ్యమేలతాడు’ ఇలా కొన్ని పవర్ఫుల్ డైలాగ్ లు పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఫ్యాన్స్ కు భాగా కనెక్ట్ అవుతాయి.

ఇక దర్శకుడి విషయానికి వస్తే.. ఇద్దరు పెద్ద హీరోలను తమ తమ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని… వాళ్ళను పాత్రలో ఒదిగింప చేయడం.. హ్యాండిల్‌ చేసిన విధానంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

ముగింపు:

కమర్షియల్ ఎలెమెంట్స్ తో రొటీన్ గా వస్తున్న సినిమాలు…ఆ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక టానిక్ లాంటిది. మంచి సందేశం తో పాటు ఆలోచింప చేసే డైలాగ్ లు… పాత్రల్లో కనబరిచిన అభినయం.. కధ నడిచిన విధానం మొత్తంగా చూస్తే ప్రేక్షకున్ని ‘గోపాల గోపాల’ దగ్గరకు తీసుకుంటుందని చెప్పవచ్చు.

చివరిగా: అభినయంతో ఆకట్టుకునే ‘గోపాల గోపాల’

మన తెలుగు గురూ’ రేటింగ్ : 3.75 /5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com