పల్లె యువతకు ఐటీ పండుగ 31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్ర…

పల్లె యువతకు ఐటీ పండుగ

31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటు
10 వేల మందికి శిక్షణ అందించడమే లక్ష్యం
కంపెనీలు గ్రామాలబాట పట్టేందుకు భారీ నజరానాలు, రాయితీలు

ప్రతి పల్లెకు ఐటీ రంగం విస్తరణ కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేక కృషి చేస్తున్నది. గ్రామీణ యువతకు ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా నజరానాలు ప్రకటిస్తున్నది. కంపెనీలను పల్లెబాట పట్టించేందుకు పట్టుదలతో ముందుకుసాగుతున్నది. మూడేండ్లలో పదివేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. పంచాయతీ పన్నుల మినహాయింపు, విద్యుత్ చార్జీల రాయితీ ఇవ్వనున్నది. నిపుణులను భర్తీ చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు రూరల్ టెక్నాలజీ సెంటర్స్-2016 పేరిట తీసుకొచ్చిన పాలసీ విధి విధానాలను బుధవారం వెల్లడించింది.

ముఖ్యాంశాలు

-డాటా ప్రాసెసింగ్, డాటా ఎంట్రీ, డాటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్ వంటివి రూరల్ టెక్నాలజీ కేంద్రాల(ఆర్‌టీసీ) లక్ష్యం.
-వినియోగదారుల సేవలు, వివరాల సేకరణ, టెక్నికల్ సపోర్ట్ వంటి వాటిని కూడా ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు.
-హెచ్‌ఆర్ ఆధారిత సేవలు, ఫైనాన్షియల్ అకౌంటింగ్, లీగల్ సపోర్ట్, వెబ్ మార్కెటింగ్ వంటి సేవలు ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు.

రూరల్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు నిబంధనలు

-సంబంధిత ఐటీ కేంద్రం ఆర్‌టీ కేంద్రంగా గుర్తింపు పొందాలంటే మండల/గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటై ఉండాలి.
-ఈ ప్రాంత జనాభా 50,000 లోపే ఉండాలి.
-ఈ కేంద్రం సమీప పట్టణం నుంచి 50 కిలోమీటర్ల లోపు ఉండాలి.
మూడేండ్లలో తెలంగాణ సర్కారు లక్ష్యాలు
-31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయడం.
-టాస్క్ సమన్వయంతో ఈ కేంద్రాల్లో పల్లె యువతకుఐటీ పండుగ 10వేల మందికి శిక్షణ.
-ఈ కేంద్రాల ద్వారా రాబోయే మూడేండ్లలో 2,500 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం

-రూరల్ టెక్నాలజీ కేంద్రాలను ప్రారంభించిన కంపెనీలకు మొదటి మూడేండ్లలోపు పంచాయతీ పన్నుల మినహాయింపు ఉంటుంది.
-ఐటీ కంపెనీల స్థాయిని బట్టి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకొని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్)లో పేర్కొన్నట్లుగా విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తారు.
-చిన్న మధ్య తరహా, సూక్ష్మ కంపెనీలకు సైతం ఎగ్జిబిషన్ స్టాళ్లలో అద్దె రాయితీ వర్తిస్తుంది.
-రూ.40లక్షల లోపు పెట్టుబడితో పెట్టే మొదటి మూడు సంస్థలకు యాభైశాతం రాయితీని అందిస్తారు. అంతకుమించిన వాటికి పదిశాతం సబ్సిడీ ఇస్తారు.
-మూడేండ్లపాటు 25శాతం కిరాయి మినహాయింపును ఇస్తారు.
-టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ కంపెనీకి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది.
-ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను భర్తీ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున ప్రోత్సాహకం (నియామక సాయం) అందిస్తుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)లో శిక్షణ పొందిన వారికి వీటిలో ప్రాధాన్యమిస్తారు.
-ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మొదటి మూడు కంపెనీలకు రూ.10 లక్షల సబ్సిడీని మూడేండ్ల పాటు అందించనుంది.

పల్లె యువతకు ఐటీ పండుగ31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్ర... పల్లె యువతకు ఐటీ పండుగ

31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్ర… 18342262 675522192655844 774813782256836782 n
పల్లె యువతకు ఐటీ పండుగ31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్ర... పల్లె యువతకు ఐటీ పండుగ

31 జిల్లాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్ర… 18447036 675522189322511 4811987297892248502 n

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com