తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడ…

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల, కాల్వల ద్వారా వచ్చే నీటి ద్వారా, వర్షం ద్వారా వచ్చే నీటి ద్వారా, పడబాటు (రీ జనరేటెడ్) నీళ్ల ద్వారా చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరిగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు.

‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’’ అనే కార్యక్రమంపై ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ కడియం శ్రీహరి, మంత్రి శ్రీ టి. హరీశ్ రావు, ఎంపిలు శ్రీ కె. కేశవరావు, శ్రీ బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ మర్రి జనార్థన్ రెడ్డి, శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ దివాకర్ రావు, విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్సి శ్రీ మురళీధర్, సీఇలు, ఎస్ఇలు పాల్గొన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్ పై నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

‘‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులున్నాయి. 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు 265 టిఎంసిల నీళ్లను కేటాయించారు. అంటే అంత పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. కానీ సమైక్య పాలనలో చెరువులు ధ్వంసం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే, మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించుకుని చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న నీరు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసు కట్టు చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించాలి. ఆ చెరువును ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేయాలి. మొదటి చెరువు నింపుకుంటూ పోతే కింద ఉన్న చెరువులు కూడా నిండుతాయి. దీని కోసం కట్టు కాలువ (ఫీడర్ ఛానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతీ మండల ఎఇ దగ్గర ఆ మండల చెరువులకు సంబంధించిన మ్యాపులు ఉండాలి. ఏ కెనాల్ ద్వారా ఏ చెరువు నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాముల ద్వారా, పడబాటు ద్వారా, వర్షం ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థవంతంగా సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువులు… ఇలా అన్నింట్లో నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలు కూడా బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని, ఏడాదిలోగా అన్ని చెరువులు నింపడానికి అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచ పుష్కలంగా నీళ్లు వస్తాయి కాబట్టి, అలా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ చెరువుల అనుసంధానం పని పూర్తి కావాలని సీఎం చెప్పారు. ఈ పనిని అత్యంత ముఖ్యమైన పనిగా నీటి పారుదల శాఖ గుర్తించాలని కోరారు. చెరువులను, కట్టు కాలువ, పంట కాల్వలను పునరుద్దరించడంతో పాటు అవి కలకాలం బాగుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఆయకట్టు దారులే కాల్వలు, తూముల మరమ్మత్తులు చేసుకునే వారని, ఎండాకాలంలో చెరువు మట్టిని తోడడం ద్వారా ఎప్పటికప్పుడు పూడిక తీసేవారని చెప్పారు. మళ్లీ ఆ పాతరోజులు రావాలని, దీనికోసం గ్రామాల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని సీఎం చెప్పారు. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటి పారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరే మనకు ప్రధానం. ఇంత వరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతారంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికా దేశాల్లో రైతుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన దగ్గర, ముఖ్యంగా సమైక్య పాలనలో రైతులు చాలా దారుణంగా వంచించబడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ది కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాము. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆర్థిక వేత్తలు అభినందిస్తున్నారు. రైతుబంధు పథకాన్ని ఒక మార్గదర్శకంగా అరవింద్ సుబ్రహ్మణ్యం అభివర్ణించారు. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబడ్డే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది’’ అని ముఖ్యమంత్రి చెప్పురు.

‘‘నీటి పారుదల వ్యవస్థను మెరుగు పర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్నా వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించండి. అక్కడ అవసరమైన లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడి హట్టి బ్యారేజి నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉండే కుప్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీని ద్వారా కుంటాల జలపాతానికి కూడా నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణాలో కూడా కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటిని కూడా సమర్థంగా వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao instructed the officers of Irrigation department that they should take care of every drop of water without any waste and should be diverted towards the tanks in the state. The CM said, that, all through the year, 365 days every tank in the state should blossom with water. He said, that, the chain of tanks that have come into existence since days of Kakatiyas should be converted as live sources of water and make complete use of the irrigated source in Telangana. The CM suggested that an appropriate strategy has to be evolved to fill the chain of tanks through the waters flowing from the canals of major and medium irrigation projects, rainwater and the regenerated water. The CM said that we have to make essentially the running water to walk. He instructed that linking the canals to the tanks Mandal wise irrigation maps are to be designed.

The Hon’ble Chief Minister held a review meeting on Saturday afternoon at Pragathi Bhavan on the linkage of a chain of tanks with major and medium irrigation project canals water. Deputy Chief Ministers Sri Mahmood Ali, Sri Kadiyam Srihari, Ministers Sri T. Harish Rao, MPs Sri K. Keshava Rao, Sri B. Vinod Kumar, MLAs Sri Vemula Prashanth Reddy, Sri Marri Janardhan, Sri Enugu Ravindar Reddy, Sri Guvvala Balaraju, Sri Diwakar Rao, Whip Sri Palla Rajeshwar Reddy, Chief Advisor to the Government Sri Rajiv Sharma, CMO Secretary Ms. Smita Sabharwal, Engineer in Chief of Irrigation Department Sri Muralidhar, CEs, SEs participated in the meeting.

The Irrigation department officers made a power point presentation on the subject, mapping of the chain of tanks, developed by National Remote Sensing Agency and Indian Space Research Organization. The Chief Minister made a number of suggestions on the provision of irrigation water by making optimum utilization of thousands of chain of tanks in the state.

“The state has inherited thousands of tanks since days of Kakatiyas. The Bachawat Tribunal in 1974 itself allocated 265 TMC of water from Godavari and Krishna for minor irrigation through tanks. This means we have a storage capacity of water on a large scale through the chain of tanks. However, during the erstwhile rule, the tanks were totally neglected. Soon after the formation of Telangana, we rejuvenated the tanks through Mission Kakatiya. We are constructing irrigation projects with huge investments. Without wasting even, a single drop of water flowing from these projects, we should divert them to tanks. We have the chain of tanks spread all over the state. Each chain has in it anywhere between 20 to 70 tanks. We need to identify the first tank of the chain and link it to the project canal. When we start filling the first tank it automatically follows, through the water flowing out of it, that the other tanks also will be filled. For this, the feeder canal and irrigation canal are to be made ready.

Every Mandal Assistant Executive Engineer should have in his position the Mandal irrigation Maps. An appropriate strategy has to be evolved for identification of the right canal to fill a particular canal. One should have the knowledge as to how the overflown water reaches from one tank to another. In addition to water flown from the projects, water from thousands of check dams, regenerated water as well as rainwater, drop by drop should be diverted to the tanks. In Telangana water should not run but walk slowly and only then we will able to make perfect use of it. When there is full of water in the rivers, canals, reservoirs, check dams, tanks etc., the whole atmosphere in Telangana transforms wonderfully. This also makes it possible to have adequate rains and increase the ground levels of waters” said the Chief Minister.

The Chief Minister said that an appropriate strategy to fill up the chain of tanks totally in the coming two months and also the construction of required canals to fill the tanks should be completed in a year’s time. The CM said that the funds required for this will be released immediately. He said that it is expected water in abundance would flow from the Kaleshwaram lift irrigation project from next June and as such to make proper use of the water the linkage of canals to the tanks shall be completed. He said that this should be treated on top priority item by the irrigation department. The CM also said that in addition to revival of tanks, feeder canals and irrigation canals enough care to be taken that they last longer. The CM reminded that in the earlier days the farmers in the ayacut used to get repair the canals and sluice and as well as remove the soil in the tanks time to time. He hoped that those days are to come again which requires educating the rural people. CM announced that shortly he will convene a meeting with irrigation engineers for a proper understating of a linkage of canals and tanks.

“One has to think with reality. Priorities are to be identified and accordingly continue to work. In Telangana, more than 75% are depending on agriculture. Unfortunately, till now it has been viewed as an unimportant sector. In Europe and USA farmer get top priority. Importance and priority is also given there for production and productivity. Here in Telangana during the erstwhile rule farmer was totally neglected. After the formation of the Telangana number of initiatives and schemes have been taken up for the welfare of the farmers and development of agriculture. The Rythu Bandhu scheme being implemented in Telangana has all the praise from several economists. In an article title, ‘Rythu Bandhu can be the social & Agri policy template’ economist Sri Arvind Subramanian praised the scheme. Since the thought process is in real terms it has become possible” said CM.

“We have given topmost priority for the betterment of irrigation system in the state. Irrigation projects are in the process of construction for making complete utilization of our share of water in Krishna and Godavari rivers. Please identify the other sources of water where ever possible. The Government is fully prepared to construct wherever necessary lifts, canals, and reservoirs. The Thammidihatti barrage construction should be taken up. The Kupty project which will be the balancing reservoir to Kadem project, tenders to be called. Through this, there is a possibility of water source for Kuntala waterfalls. There is enough of water in river Krishna also. We need to implement a strategy to make use of that water also” said CM.

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడ…
తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడ… 1531599033 570
తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడ… 1531599033 995

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com