5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ దిశగా భారత్ అడుగులు!

5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు, ఆర్టికల్ 370 రద్దు చారిత్రక నిర్ణయం: ఆర్.కె. సింగ్

100 రోజుల ప్రగతిపై నివేదికను విడుదల చేసిన కేంద్ర విద్యుత్, ఇందన శాఖ సహాయ మంత్రి

కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తమకు అధికారాన్ని కట్టబెట్టాయని, ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమి దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్ర విద్యుత్, ఇందన శాఖ, నూతన మరియు పునరుత్పాదక మంత్రి ఆర్.కె. సింగ్ అన్నారు.

09 SEP 2019 హైదరాబాద్ లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ 100 రోజుల ప్రగతిపై నివేదికను విడుదల చేశారు.

ఆర్టికల్ 370 రద్దు ఛారిత్రక నిర్ణయం అని, తద్వారా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి మారుతుందని, ఆ రాష్ట్రం లో సామాజిక ఆర్థిక పరిస్థితి మారుతుందని, ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు.

ఐదు ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు దేశం అడుగులు వేస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పథకాన్ని 6.37 కోట్ల మంది రైతులకు చేరువ చేశామని కేంద్ర ప్రభుత్వం వంద రోజుల ప్రగతి నివేదికను సమర్పిస్తూ స్పష్టం చేశారు.

బ్యాంకుల విలీనం ద్వారా అదనపు ఋణ సదుపాయం, విస్తరణ వంటి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా 142 నుంచి 77 కు చేరుకుందని అన్నారు.

అంతే కాకుండా, పిల్లల హక్కులను కాపాడేందుకు, వారిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టనుందని, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు 180 ఏకలవ్య మోడల్ పాఠశాలలకు ఆమోదం తెలిపామన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శిస్తాన్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా అడుగుతున్న నేపథ్యంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com