‘జబర్దస్త్’ కార్యక్రమంపై ఫిర్యాదు

ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ కార్యక్రమంపై గౌడ సంఘ నాయకులు శ్రామిక గౌడ మహిళాజీవన విధానాన్ని అవమాన పరచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు శనివారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈనెల 18న ప్రసారమైన కార్యక్రమంలో కల్లు వృత్తిని మరియు శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని కించ పరిచే విధంగా కార్యక్రమాన్ని ప్రసారం చేశారని…అంటే కాకుండా గతేడాది జూలై లో కూడా కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని…దీనికి కారణమైన ఈటీవీ యాజమాన్యంపైన, కార్యక్రమ నిర్యక్రమ నిర్వాహకులపై, మరియు ఆర్టిస్టులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు బి. నరేష్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు అశోక్‌గౌడ్ తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com