జనసేన ఆవిర్భావసభ మార్గదర్శకాలు

క్షేమంగా వచ్చివెళ్లండంటూ ఆవిర్భావసభకు వచ్చే ప్రజానీకానికి పిలుపునిచ్చింది జనసేన.

అభిమానులు, కార్త్యకర్తలు పాటించాల్సిన మార్గదర్శకాలు ఇవే!

-టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు

-ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారికి దారి ఇవ్వాలి

-ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి

-పోలీసులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి

-ప్రజలను గౌరవించండి. వారితో దురుసుగా ప్రవర్తించకండి.

-మద్యం సేవించి వాహనం నడపకండి.

-రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపకండి.

-ఇతర వాహనాల్ని ఓవర్ టేక్ చేయకండి. అతివేగంవద్దు. సాధారణవేగంతో నడపండి.

-ద్విచక్రవాహనాల లైసెన్సర్లు తీసి రోడ్లపై నడపకండి.

-సభాస్థలిలో శాంతంగా ఉండండి. సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి.

-అనుక్షణం పార్టీహోదాని నిలబెట్టండి. వ్యగ్తిగత ప్రాధాన్యతకంటే పార్టీప్రాధాన్యత ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.

-చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్లపైకి ఎక్కకండి.

-విద్యుత్తు స్థంభాలకి దూరంగా ఉండండి.

-జిల్లాలోని ప్రచారపత్రాల్లో పార్టీ ఆమోదించిన వారిఫోటోలు తప్ప వేరేఎవరివీ ఉండకూడదు.

జనసేన ఆవిర్భావసభ మార్గదర్శకాలు

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com