కష్టం పవన్ ది..కాపీ కాంగ్రెస్ ది!!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ విజ‌న్ మానిఫెస్టో విడుద‌ల చేసిన‌ప్పుడు కుహ‌నా రాజ‌కీయ శ‌క్తులన్నీ మూకుమ్మ‌డిగా దాడి చేశాయి.. ఉచిత గ్యాస్ ఎలా ఇస్తారు..? ఒక ప్ర‌శ్న‌.. 2500 మ‌హిళ‌ల ఖాతాల్లోకి ఎలా ఇస్తారు..? రెండో ప్ర‌శ్న.. ఇలా ప్ర‌తి అంశాన్ని అసాధ్యం అంటూ విమ‌ర్శించిన వారే.. అన్నింటికీ జ‌న‌సేనాని ఇచ్చిన స‌మాధానం ఒక్క‌టే.. వేల కోట్ల రాజ‌కీయ దోపిడికి అడ్డుక‌ట్ట‌వేస్తే సాధ్య‌మే అంటున్నారు.. అయితే అధికార‌-ప్ర‌తిప‌క్షాలు గానీ, ఇత‌ర రాజ‌కీయ వాదులు గానీ ఈ వాద‌న‌ని తీవ్రంగా వ్య‌తిరేకించారు.. నెల రోజులు గ‌డిచే స‌రికి సీన్ మారిపోయింది.. జ‌న‌సేనాని విజ‌న్‌ని మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు కాపీ కొట్ట‌డం మొద‌లు పెట్టాయి.. ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఓ అడుగు ముందు ఉంది..

ఏపీసీసీ విడుద‌ల చేసిన మేనిఫెప్టోలో ప్ర‌తి పేద కుటుంబానికి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉచిత గ్యాస్ అనే ప్ర‌క‌ట‌న చేసిన ఏకైక రాజ‌కీయ పార్టీ జ‌న‌సేన కాగా, ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసింది జ‌న‌సేనాని మాత్ర‌మే.. మొన్న‌టి వ‌ర‌కు అసాధ్యం అన్న నాలుక‌లు, ఇప్పుడు ఆ నాలుక‌ని మ‌డిచేస్తున్నాయి.. రెండో పాయింటు సిపిఎస్ విధానం ర‌ద్దు.. సిపిఎస్ ఉద్యోగులు విప‌క్షంలో ఉన్నారుగా సాయం చేయ‌మ‌ని వెళ్తే, స‌ద‌రు నాయ‌కుడు మా నాన్న‌గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీంని మేమెలా ర‌ద్దు చేస్తాం అని బ‌దులిచ్చారు.. అధికార పార్టీ అయితే మ‌నం పెట్టిన స్కీం కాదు.. పోతుంది ఉద్యోగులేగా అని గ‌మ్మున కూర్చుంది.. ఆ స‌మ‌యంలో సిపిఎస్ ఉద్యోగుల గోడు విని, ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లోనే ఈ విధానాన్ని ర‌ద్దు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించారు.. ప్ర‌తి ఉద్యోగి కుటుంబానికి రిటైర్మెంట్ త‌ర్వాత భ‌రోసా ఇచ్చే పాత ఫింక్ష‌న్ విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని ఉద్యోగుల‌కి హామీ ఇచ్చారు.

ఇప్పుడు అస‌లు కాంగ్రెస్ పార్టీ త‌న మ్యానిఫెస్టోలో సిపిఎస్ ర‌ద్దు అంశాన్ని చేర్చింది.. నిస్సిగ్గుగా అని ఎందుకు అనాల్సి వ‌చ్చిందంటే.. అస‌లు కాంట్రిబ్యూట‌రీ ఫింక్ష‌న్ విధానానికి రూపం ఇచ్చిందే కాంగ్రెస్ హ‌యాంలోని యూపీఏ స‌ర్కారు.. ఇప్పుడు ఆ విధానాన్ని మేమే ర‌ద్దు చేస్తామ‌న‌డం ఎన్నిక‌ల స్టంట్ కాదా..?

 

చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కి 33 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు.. 2014కి ముందు కేంద్రంలో ప‌దేళ్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోని యూపీఏ ప్ర‌భుత్వ‌మేగా, ప్ర‌ధాని మ‌న్మోహ‌నే అయినా నిర్ణ‌యాధికారం ఓ మ‌హిళ‌(సోనియా)దే క‌దా..?

మ‌రి అప్పుడు ఎందుకు ఈ వ్య‌వ‌హారంపై చ‌ట్టం చేయ‌లేక‌పోయారు.. ఇప్పుడు జ‌న‌సేన అధినేత మ్యానిఫెస్టోలో చేర్చ‌డంతో.., మీరూ ఎంచ‌క్కా ఓట్ల కోసం కాపీ కొట్టేస్తున్నారా..?

ఇక 9వ షెడ్యూల్ ద్వారా కాపుల‌కి రిజ‌ర్వేష‌న్లు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించే వ‌ర‌కు కాపుల‌కి ఎలా రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలి అనే అంశం మీద ఏ ఒక్క పార్టీకి స్ప‌ష్ట‌త లేదు.. ప్ర‌తిప‌క్ష నేత అయితే కాపుల‌కి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పేశారు.. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాలుగేళ్లుగా ఆడుతున్న నాట‌కం అంతా చూస్తూనే ఉన్నారు.. ల‌క్ష‌లాది మంది రోడ్డెక్కాకే కార్పొరేష‌న్ అంటూ కంటి తుడుపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.. ఇప్పుడు జ‌న‌సేన అధినేత 9వ షెడ్యూల్ స‌వ‌ర‌ణ ద్వారా కాపుల‌కి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌న‌గానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ 9వ షెడ్యూల్‌ని ఫాలో అయిపోయింది..

జ‌న‌సేన అధినేత త‌న పూర్తి మ్యానిఫెస్టోని అందుకే విడుద‌ల చేయ‌లేదేమో..?

ఎన్నిక‌ల స‌మ‌యానికి అంతా కాపీ కొట్టేసి., ఇది మాదే అని చాటింపు వేసేసుకుంటార‌ని ఆయ‌న‌కి అర్ధం అయిపోయిన‌ట్టుంది.. కాపీ పేస్ట్ మొద‌ల‌య్యింది.. దీంతో ప్ర‌జా పాల‌న వ్య‌వ‌హారాల్లో జ‌న‌సేనానికి ఉన్న విజ‌న్‌.. మిగిలిన పార్టీల‌కి లేద‌న్న విష‌యం తేట‌తెల్లం అవుతోంది.. ఈ కాపీ పేస్ట్ కూడా ఎన్నిక‌ల గిమ్మిక్కే.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com