ఐడిబిఐ బ్యాంకుకు మూల‌ధ‌న నిధులను అందించేందుకు కేంద్రం ఎందుకు ఆమోదం తెలిపింది ?

ప్ర‌భుత్వం ద్వారా 4,557 కోట్ల రూపాయ‌ల‌ మూల‌ధ‌న నిధుల ను ఐడిబిఐ బ్యాంకు కు అందించేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న‌ 03 SEP 2019 స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఇది ఐడిబిఐ బ్యాంకు కార్యకలాపాల ప్ర‌క్రియ ను పూర్తి చేయ‌డం లో స‌హాయ‌ప‌డ‌ట‌మే కాకుండా, ఆ బ్యాంకు తిరిగి లాభ‌దాయ‌క‌త ను సాధించ‌డం తో పాటు సాధార‌ణ రుణ మంజూరు స్థితి కి చేరుకోగలగడం మరియు ప్ర‌భుత్వాని కి అది పెట్టిన‌టువంటి పెట్టుబ‌డి ని ఒక స‌రి అయిన త‌రుణం లో తిరిగి రాబ‌ట్టుకొనే ఐచ్ఛికం ప్రాప్తమవుతుంది.

ఐడిబిఐ బ్యాంకు త‌న కు వార‌స‌త్వం గా అందిన ఆస్తి, అప్పుల ప‌ట్టీ తో స‌ర్దుబాటు కై క‌స‌ర‌త్తు ను పూర్తి చేసుకోవ‌డం కోసం ఒక‌ సారి మూల‌ధ‌న నిధుల అంద‌జేత అవసరపడుతోంది.

ఈ బ్యాంకు ఇప్ప‌టికే గ‌ణ‌నీయ‌మైన‌టువంటి స్థాయి లో ప్ర‌క్షాళ‌న ను చేప‌ట్టింది.  2018వ సంవ‌త్స‌రం జూన్ లో 18.8 శాతం వ‌ద్ద శిఖ‌ర స్థాయి లో ఉన్న నిక‌ర ఎన్‌పిఎ ను 2019వ సంవ‌త్స‌రం జూన్ లో 8 శాతాని కి త‌గ్గించుకొంది.  దీని కి గాను మూల‌ధ‌నాన్ని దీని యొక్క షేర్ హోల్డ‌ర్స్ వ‌ద్ద నుండి తీసుకోవ‌డం జరుగుతుంది.

ఎల్ఐసి 51 శాతం నిధుల‌ ను అందించింది.  ఇకపై మ‌రెంత మాత్రం అద‌న‌పు నిధుల‌ ను ఇచ్చేందుకు బీమా నియంత్రణదారు నుండి అనుమ‌తి ద‌క్క‌ని ద‌శ కు చేరుకొన్నది.  అవసరమైన 9,300 కోట్ల రూపాయ‌ల నిధుల లో నుండి ఎల్ఐసి 51 శాతం ధన రాశి ని (4,743 కోట్ల రూపాయ‌లు) అందిస్తుంది.  మిగతా 49 శాతం నిధులు (4,557 కోట్ల రూపాయ‌లు) ఒక సారి ప్రాతిపదిక న తన వాటా లో భాగం గా  ప్ర‌భుత్వం వైపు నుండి ఇచ్చే ప్ర‌తిపాదన ఉన్నది.

ఈ పెట్టుబడి ముగిసిన అనంతరం, ఐడిబిఐ బ్యాంకు తనంతట తాను అధిక మూల‌ధ‌నాన్ని స‌మీక‌రించుకో గ‌లుగుతుంద‌ని,  అంతేకాకుండా వ‌చ్చే సంవ‌త్స‌రం లో ఏదో ఒక స‌మ‌యానిక‌ల్లా ఆర్‌బిఐ యొక్క ప్రోమ్ ప్ట్ క‌రెక్టివ్ ఏక్శన్ (పిసిఎ) ఫ్రేమ్ వ‌ర్క్ నుండి బయటపడ వ‌చ్చ‌ని ఊహించ‌డ‌మైంది.

రీక్యాప్ బాండ్ ల జారీ ద్వారా ఈ క్యాశ్ న్యూట్రల్ ఇన్ ఫ్యూజన్ చోటు చేసుకోనుంది.  క్యాశ్ న్యూట్రల్ ఇన్ ఫ్యూజన్ అంటే.. ప్ర‌భుత్వం బ్యాంకు లోకి మూల‌ధ‌నాన్ని ప్ర‌వ‌హింప జేస్తుంది.  మ‌రి అదే రోజున ప్ర‌భుత్వం నుండి రీ క్యాప్ బాండ్ ను బ్యాంకు కొనుగోలు చేస్తుంది అని భావం.  దీని తో ద్ర‌వ్య‌త్వం పై గాని, లేదా వర్తమాన సంవ‌త్స‌ర‌ బ‌డ్జెటు మీద గాని ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌బోదు.

పూర్వ‌రంగం :

2018వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు లో మంత్రిమండ‌లి నుండి ఆమోదం లభించిన అనంత‌రం ఐడిబిఐ బ్యాంకు లో ఎల్ ఐసి 51 శాతం వాటా ను దక్కించుకొంది.  ప్ర‌భుత్వం దీని ప్ర‌మోట‌ర్ గా ఉంది. ప్రభుత్వం చేతి లో ఈ బ్యాంకు లోని 46.46 శాతం వాటా ఉన్నది.

గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలం లో ఐడిబిఐ బ్యాంకు యొక్క ఆర్థిక స్థితి లో చెప్పుద‌గ్గ మెరుగుదల సాధ్యపడింది.

•  సిఆర్ఎఆర్ 30.9.18 నాడు 6.22 శాతం ఉన్న‌ది కాస్తా, 31.3.19 నాటికి 11.58 శాతాని కి మెరుగైంది.

•  నికర ఎన్‌పిఎ నిష్ప‌త్తి 30.9.18 నాడు 17.3 శాతం ఉన్న‌ది కాస్తా, 31.3.19 నాటికి 10.11 శాతాని కి మ‌రియు 2019వ సంవ‌త్స‌రం జూన్ 30వ తేదీ నాటి కి 8.02 శాతాని కి పరిమితం అయింది.

•  ప్రొవిజ‌న్ క‌వ‌రేజ్ రేశియో (పిసిఆర్‌) 69 శాతం (30.9.18 నాటి కి) నుండి 83 శాతాని కి (31.3.19 నాటి కి), మ‌రి అటు త‌రువాత 2019వ సంవ‌త్స‌రం జూన్ 30వ తేదీ కి మ‌రింత గా అంటే 88 శాతాని కి చేరుకొన్నది.

•  ఎల్ఐసి తో సమన్వయం కార‌ణం గా 3184 శాఖ‌ల కు చెందిన 29 కోట్ల మంది పాలిసీ హోల్డ‌ర్లు, 11 ల‌క్ష‌ల మంది ఏజెంట్లు మ‌రియు 2 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల చేరిక కూడా దక్కింది.

•  ఎల్ఐసి తో సమన్వయం కార‌ణం గా 2020 ఆర్థిక సంవ‌త్స‌రం లో 500 కోట్ల రూపాయ‌లు మరియు 2021 ఆర్థిక సంవ‌త్స‌రం తరువాత నుండి 1,000 కోట్ల రూపాయ‌ల రాబ‌డి లభించగలద‌ని అంచ‌నా వేయ‌డ‌మైంది.

•  2019వ సంవ‌త్స‌రం మార్చి నెల‌లో 160 కోట్ల రూపాయ‌ల విలువైన ప్రీమియం తో బీమా విక్ర‌యాలు ప్రారంభం అయ్యాయి.  ఈ గతి పుంజుకొన్నది.  ఈ సంవ‌త్స‌రం మొద‌టి నాలుగున్న‌ర నెల‌ల కాలం లో 250 కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన ప్రీమియ‌మ్ వసూలైంది.  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రాని కి 2000 కోట్ల రూపాయ‌ల విలువైన ప్రీమియ‌మ్ మ‌రియు 200 కోట్ల రూపాయ‌ల రాబ‌డి సాధించాలనేది ల‌క్ష్యం గా ఉంది.

•  ఎల్ఐసి ఏజెంట్ల నెట్ వ‌ర్క్ ద్వారా 5,000 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు వ్యాపారం (గృహ రుణాలు, వాహ‌న రుణాలు, వ్య‌క్తిగ‌త రుణాలు వంటి మార్గాల లో) సమకూరవచ్చని ఆశిస్తున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com