ఎమ్మెస్ నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం

ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది.

ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మదాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎంఎస్‌ నారాయణ ఆరోగ్యం విషయమంగా మారడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆయన ఇటీవల భీమవరంలో అస్వస్థతకు గురయిన నేపధ్యంలో చికిత్స నిమిత్తం ఆయన్ను ఆసుపత్రికి తరిలించారు. గత రెండు
రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తుంది.

ఎంఎస్‌ నారాయణను సహచరులు, సన్నిహితులు ఆయన్ను ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు.

నటులు బ్రహ్మానందం, రావు రమేష్‌లు, తదితర ప్రముఖులు కిమ్స్‌ ఆస్పత్రిలో ఎమ్మెస్ నారాయణను పరామర్శించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com