ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సందర్శించిన ఇండోనేశియా ప్రతినిధివర్గం!

‘ఇఫ్లూ’ను సందర్శించిన ఇండోనేశియా ప్రతినిధివర్గం

ముంబయి లో రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేశియా మహావాణిజ్య దూత గా ఉన్న శ్రీ అదె సుకేందర్ 16 May నాడు హైదరాబాద్ లో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఎఫ్ఎల్ యు..‘ఇఫ్లూ’) వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్ ను కలుసుకొన్నారు.

శ్రీ అదె సుకేందర్ వెంట తొమ్మిది మంది అధికారిక ప్రతినిధులు విచ్చేశారు. విద్య రంగం లో భారతదేశానికి, ఇండోనేశియా కు మధ్య క్రియాశీల సహకారం ఎంతైనా అవసరం అని ఈ సందర్భం గా శ్రీ అదె సుకేందర్ నొక్కి చెప్పారు.

  ఇఎఫ్ఎల్ యూనివర్సిటీ ని తాను సందర్శించడం ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, దౌత్యవేత్తలకు నైపుణ్య శిక్షణ లతో పాటు సాంస్కృతిక సంబంధాలను కూడా ప్రోత్సహించగలుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఇండోనేశియా విద్యార్థులు అనేక మంది భారతదేశం లోని వివిధ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్న సంగతిని కాన్సల్ జనరల్ ప్రస్తావించారు.  కాన్సల్ జనరల్ వెంట వచ్చిన ప్రతినిధివర్గం లో కాన్సల్ (ఎకనామిక్స్) శ్రీ యదీ సురియాహాదీ, వైస్ కాన్సల్ (ఎకనామిక్స్) శ్రీ సొయెమరజంతో కార్యసేన్ టిక, ట్రేడ్ ఆటాశే శ్రీ ఫెరీ శామ్యూల్ జేకబ్, ఇండోనేశియన్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ సెంటర్ (ఐఐపిసి), అబూధాబీ డైరెక్టర్ శ్రీ డి. రిజ్ కీ నొవిహమ్జా లతో పాటు ఇండోనేశియా ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ (ఐటిపిసి), చెన్నై డైరెక్టర్ శ్రీ కుమార జతీ ఉన్నారు.

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్ ‘ఇఫ్లూ’ కోర్సులను గురించి, కార్యక్రమాలను గురించి, అలాగే గత రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయం చేపట్టిన ఇతర కార్యక్రమాలను గురించి ప్రతినిధివర్గానికి సంక్షిప్తంగా వివరించారు. 

ప్రస్తుతం ఈ  విశ్వవిద్యాలయం లో చదువుకుంటున్న ఇండోనేశియా విద్యార్థులకు సకాలంలో తగిన సహకారాన్ని అందిస్తున్నందుకుగాను ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ కు, యూనివర్సిటీ పాలనాయంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.  మరింత మంది విద్యార్థులను ఇఫ్లూ కు పంపాలనుకుంటున్నానని శ్రీ సుకేందర్ అన్నారు. 

అదే విధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఉపాధ్యాయ శిక్షణ కోసం, వృత్తివిద్య సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపాధ్యాయులను, దౌత్యవేత్తలను కూడా పంపించేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తానని ఆయన అన్నారు.  యూనివర్సిటీ లో అంతర్జాతీయ సంబంధాల డీన్ ప్రొఫెసర్ సురభి భారతి ఈ ఇండోనేశియా ప్రతినిధివర్గం విశ్వవిద్యాలయ సందర్శన కు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com