ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని విజయవాడే

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటుంది అనే దానిమీద పలు మంత్రులు పలు రకాలుగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన తరుణంలో, రాజధాని ఎక్కడ ఉంటుంది అనేదాని మీద తీవ్ర ఉత్కంటత నెలకొన్న పరిస్థితి ఏర్పడటం మనము గమనిస్తున్నాము.

అయితే ఈ రోజు జరిగిన మంత్రులు మరియు ముఖ్య అధికారుల సమావేశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తూ రాజధాని మీద ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సమావేశంలో విజయవాడ-గుంటూరు మధ్యలో అయితేనే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గా అన్నిరకాలుగా బాగుంటుందని అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తుంది.

అయితే రాజధాని ఏది అనే స్పష్టమైన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రేపు అసెంబ్లీ లో వెల్లడిస్తారని తెలుస్తుంది.

మరి ఈ విషయాన్ని ప్రతిపక్షాలు మరియు ఇతర ప్రాంత నాయకులు ఏ విధంగా స్వాగతిస్తారో చూడాలి.

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని విజయవాడే  468 60a

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని విజయవాడే  728x90

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com