అధికరణ 370 రద్దు పై కేంద్ర మంత్రి వివరణ!

అధికరణ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ సహసోపాతమైన నిర్ణయం; మైనారిటీలు , ఎస్.సి/ ఎస్.టి ల అభివృద్ది కి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాందాస్‌ అథవాలే

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే

 

డా బి.ఆర్ అంబేద్కర్ అఖండ భారతదేశ కలల్ని కేంద్ర ప్రభుత్వం అధికరణ 370 రద్దు ద్వారా నెరవేర్చిందని కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.

20 SEP 2019 హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

గడచిన 5 ఏళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 88,19,184 గృహాలు , తెలంగాణ రాష్ట్రం లో 2,11,939 గృహాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి జనధన యోజన ద్వారా  దేశ వ్యాప్తంగా 37 కోట్ల బ్యాంక్ అక్కౌంట్స్ , తెలంగాణ రాష్ట్రం లో 79 లక్షల బ్యాంక్ అక్కౌంట్స్ తెరిచినట్లు, ఉజ్వల యోజన లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రం లో 10,75,166 ఉన్నట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం లో ఎస్.సి/ ఎస్.టి ల పై జరుగుతోన్న దాడులను అరికట్టడం లో ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ ప్రభుత్వం వీటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల నిర్మూలనతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించవచ్చని కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. కులాంతర వివాహాల ద్వారా సాంఘిక సమగ్రత కోసం డాక్టర్‌ అంబేడ్కర్‌ పథకాన్ని అమలుపరుస్తోందని తెలిపారు. చట్టబద్ధంగా సాగే కులాంతర వివాహానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ నుంచి రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుందన్నారు.

అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో  అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై  తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికారులతో  కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే సమీక్షా సమావేశం నిర్వహించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com