అక్రమ వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్ నెట్ ప్రోటో కాల్ ఎక్స్ చేంజి గుట్టు రట్టు!

అక్రమ విఒఐపి ఎక్స్ చేంజ్ గుట్టు ను రట్టు చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేశ‌న్స్

చ‌ట్ట విరుద్ధం గా న‌డుస్తున్న‌ వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్ నెట్ ప్రోటో కాల్ (విఒఐపి) ఎక్స్ చేంజి గుట్టు ను రట్టు చేసినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేశ‌న్స్, ఎపి లైసెన్సీ స‌ర్వీస్ ఏరియా (ఎపి ఎల్ఎస్ఎ) వింగ్ డైరెక్టర్ శ్రీ పి. కృష్ణ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.  

ఈ సంద‌ర్భంగా కడప కు చెందిన శేఖ్ అన్వ‌ర్ బాషా ను అరెస్టు చేశారని   శ్రీ   పి. కృష్ణ కుమార్ వెల్లడించారు.   

అనుమానితుడి వ‌ద్ద నుండి నాలుగు సిమ్ బాక్సులను, అక్ర‌మం గా సేక‌రించిన 345  సిమ్ కార్డులను, ఒక ల్యాప్‌టాప్‌ ను, ఇంకా ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల‌ ను కడప పోలీసులు స్వాధీనం చేసుకొన్న‌ారని కూడా వివ‌రించారు.  నిందితుడి పై  డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేశ‌న్స్  ఒక ఎఫ్ఐఆర్ ను దాఖ‌లు చేసింది.  

విఒఐపి గేట్ వే (సిమ్ బాక్సులు) ద్వారా స్థానిక కాల్స్ ను నిందితుడు అంత‌ర్జాతీయ విఒఐపి కాల్స్ గా మార్పిడి చేస్తున్నాడు.  ఈ త‌ర‌హా కాల్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తం గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ కు శ్రీ కృష్ణ కుమార్ సూచించారు.  

ఒక వేళ వారు వారి ఫోన్ లో ఒక‌ ఇండియ‌న్ నంబ‌ర్ తో గాని, లేదా ఎటువంటి నంబర్ క‌న‌ప‌డ‌కపోయినప్పటికీ ఒక అంత‌ర్జాతీయ కాల్ ను అందుకొన్నట్ల‌యితే, టోల్ ఫ్రీ నంబ‌ర్1800 110 420 కి, లేదా 1963 కు  ఫోన్ చేయ‌డం ద్వారా  డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేశ‌న్స్  కాల్ సెంట‌ర్ దృష్టి కి తీసుకు రావలసిందని ప్రజలకు శ్రీ కృష్ణ కుమార్ స‌ల‌హా ఇచ్చారు. 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com